Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్మృతి ఇరానీకి వినోద్‌కుమార్ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వాస్తవాలు తెలుసుకుని సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ హెచ్చరించారు. 2020 నవంబర్ 28న హైదరాబాద్‌కు ప్రధాని మోడీ వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ ఎయిర్‌పోర్టుకు రాకుండా అడ్డుకున్నదెవరో తెలుసా అని ప్రశ్నించారు. ఆదివారం ఈమేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. కేసీఆర్‌పై విమర్శలు చేసే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. సంస్కారం గురించి మాట్లాడే హక్కు బీజేపీ నేతలకు ఎక్కడిందని ప్రశ్నించారు. తెలంగాణ గంగా జమున తెహజీబ్ సంస్కృతి అని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని, మతసామరస్యాన్ని గౌరవించడం కేసీఆర్‌కు తెలిసినంతగా దేశంలో ఏ రాజకీయనాయకుడికి తెలియదని ఆయన గుర్తు చేశారు.