Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ
- హైదరాబాద్ కార్యాలయాల సందర్శన
హైదరాబాద్ : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హైదరాబాద్ కార్యాలయాలను సందర్శించారు. ఆమె తన పర్యటనలో భాగంగా శ్రీ సావిత్రి కన్య ఉన్నత పాఠశాలలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఏడు నుంచి పదో తరగతి చదువుతున్న బాలికలకు 50 సైకిళ్లను పంపిణీ చేశారు. అందరు బాలికలకూ స్కూల్ బ్యాగులు, గొడుగులను అందించారు. అలాగే, పాఠశాల కోసం ఒక గోద్రేజ్ స్టోరేజీ యూనిట్, వాటర్ కూలర్‌ను డొనేట్ చేశారు. చదువులో ప్రతిభ కనబర్చిన ఇద్దరు విద్యార్థుల ఉన్నత విద్య బాధ్యతను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటుందని ఆమె తెలిపారు. అలాగే, ఉస్మాన్‌గంజ్‌లోని అనాథాశ్రమంలో జరిగిన ఒక కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. బాలురకు ఎనిమిది సైకిళ్లను పంపిణీ చేశారు. ఒక స్మార్ట్ టీవీ, ఒక వాటర్ కూలర్, ఒక రిఫ్రిజిరేటర్, ఎనిమిది ఫ్యాన్లను అనాథాశ్రమానికి అందించారు. ఈ కార్యక్రమాల్లో ఎఫ్జీఎంఓ, ఇతర స్థానిక కార్యాలయాలు, బ్రాంచ్‌ల ఎగ్జిక్యుటివ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.