Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారతదేశం గర్వించే స్థితికి అమెరికాలోని తెలుగు ప్రజలు చేరుకున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభల్లో తెలంగాణ పెవిలియన్‌ను ఆమె ప్రారంభించారు. రచయిత ప్రభావతి రాసిన బతుకమ్మ ప్రత్యేక సంచికను ఆమె ఆవిష్కరించారు. ప్రతి మహాసభలోనూ పెవిలియన్‌ను ఏర్పాటు చేయాలని ఆటా ప్రతినిధులను కవిత కోరారు. మహాసభల ద్వారా తెలుగు సంస్కృతిని ముందు తరాలకు తెలిపేందుకు ఆటా ప్రతినిధులు చేస్తున్న కృషిని కొనియాడారు. మాల్దీవులు, మారిషస్‌లో ఉన్న తెలుగు వారంతా, తెలుగు భాషను, సంస్కృతిని నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగు యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకున్నారని గుర్తు చేశారు. ఆటా వ్యవస్థాపక సభ్యుడు హన్మంత రెడ్డి, టీఆర్ఎస్ ఎన్నారై సెల్ ప్రతినిధులు, తెలంగాణ జాగృతి ప్రతినిధులు, ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.