Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమది ఫ్యామిలీ పార్టీ కాదనీ, దొంగచాటుగా వినడం సరిగాదని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. హెచ్ఐసీసీ నొవాటెల్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ నేత రవిశంకర్‌ప్రసాద్ మాట్లాడారు. ప్రధాని మోడీ ముగింపు ప్రసంగంపై వివరించారు. మోడీ బీజేపీ రెవల్యూషన్ పై మాట్లాడారని చెప్పారు. నిరంకుశ, నియంత్రుత్వ పాలన నుంచి హైదరాబాద్ కు విముక్తి కలిగించిన వ్యక్తి సర్దార్ పటేల్ అనీ, ఆయన కాంగ్రెస్ నేత అయినప్పటికీ అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటుచేశామని చెప్పారు. ప్రధానుల గురించి ఒక మ్యూజియంను ఏర్పాటుచేశామన్నారు. పార్టీ నేతలు ప్రొ పీపుల్.., ప్రొ.. గుడ్ గవర్నెన్స్(ప్రొ పీ టు ప్రొ జీ) గా ఉండాలని మోడీ సూచించారన్నారు. దేశ భవిష్యత్ పై ఆయన ఒక విజన్‌తో ఉన్నారని చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే దేశం పరిస్థితి ఉన్నతస్థానంలో ఉందన్నారు. అంతర్జాతీయ దిగుమతులు కూడా అద్భుతంగా జరిగాయని చెప్పారు. వరంగల్ జిల్లా అద్భుతంగా ఉందని చెప్పారు. గతంలో లడఖ్‌కు వెళ్లాలంటే చైనా వాళ్లు ఎప్పుడేం చేస్తారోనని బార్డర్ లో భయంభయంగా ఉండేదనీ, ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. ఒక దళితుడికి, ఒక ఆదివాసీ మహిళకు రాష్ట్రపతిగా అవకాశమిచ్చిన వ్యక్తి ప్రధాని మోడీ అని చెప్పారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా పలికితే తప్పేంటి? గతంలో అదే పేరుండేది కదా..? ఇదొక్కటే కాదు.. చాలా రాష్ట్రాలకు గతంలో ఒక పేరుంటే.. ఇప్పుడో పేరుతో పిలవడంలేదా? అని ప్రశ్నించారు.
దుర్భర పరిస్థితిలో తెలంగాణ : పీయూష్‌గోయల్
తెలంగాణ దుర్భర పరిస్థితిలో ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. హెచ్ఐసీసీ నొవాటెల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ డిక్లరేషన్ పై ప్రత్యేక చర్చ జరిగినట్లు చెప్పారు. తెలంగాణ కోసం ఎందరో యువకులు ప్రాణాలర్పించారని తెలిపారు. ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ సిద్ధించిందన్నారు. దేశంలోనే మొదటిస్థానంలోకి తెలంగాణ వస్తుందని అందరూ భావిస్తే కేసీఆర్ కుటుంబం రాష్ట్రం పరిస్థితిని దుర్భరంగా మార్చిందని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారు. రైతులు, యువకులు, నిరుద్యోగులు, మహిళలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ప్రజలు రాష్ట్రం కోసం కొట్లాడారనీ, రాష్ట్రం మొచ్చాక కూడా ఆ సమస్యలు అట్లాగే ఉన్నాయని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును రూ.40 వేల కోట్ల నుంచి రూ. లక్ష 30 వేల కోట్లకు వ్యయాన్ని పెంచి మరీ కట్టారనీ, దీని పెద్దఎత్తున అవినీతి జరిగిందని తెలిపారు. ఆ ప్రాజెక్టును కమీషన్ల కోసమే కట్టారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ తన శక్తినంతా ప్రయోగించినా దుబ్బాక, హుజూరాబాద్‌లో బీజేపీ గెలిచిందన్నారు. బండి, కిషన్ రెడ్డి, లక్షల మంది కార్యకర్తల శ్రమతో తెలంగాణలో కుటుంబ పాలనను అంతమొందిస్తామన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారని చెప్పారు.
కేసీఆర్ కుటుంబమే క్యాబినెట్ : బండి
సీఎం కేసీఆర్ కుటుంబమే రాష్ట్రంలో క్యాబినెట్‌గా వ్యవహరిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ విమర్శించారు. ఈ పరిస్థితిని చూసి యావత్ దేశం ఆశ్చర్యపోతున్నదన్నారు. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పాలన సాగుతున్నదన్నారు. ఉద్యమానికి ముందు ఒకలా.. ఇప్పడొకలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజల నుంచి బీజేపీకి స్పందన పెరుగుతుండటంతో అది చూసి కేసీఆర్, ఆయన కుటుంబం భయాందోళనలో ఉందన్నారు. పార్టీ తీర్మానాలను దాచిపెట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. కేసీఆర్ కు వచ్చి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కూర్చోవాలనిపిస్తే రావచ్చనీ, స్వాగతిస్తామని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..యాడ్ల పేరిట రూ.40 కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. కల్వకుంట్ల రాజ్యాంగం, ఓవైసీ రాజ్యాంగంతో రాష్ట్రాన్నిదోచుకుంటున్నారని ఆరోపించారు.