Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25 వేల ఆర్థిక సహాయం
అందజేసిన ఐక్యత ఫౌండేషన్..
నవ తెలంగాణ వెల్డండ
వెల్దండ మండల పరిధిలోని పల్గు తాండలో గత కొన్నేళ్లుగా నివాస ముంటున్నా ఆంధ్ర ప్రాంతానికి చెందిన రాజు కుటుంబంలో జరుగుతున్న పేదింటి ఆడ బిడ్డ జ్యోతి పెండ్లి కి ఐక్యత ఫౌండేషన్ చైర్మెన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అండగా నిలిచారు. ఆదివారం రాజు కుటుంబానికి రూ. 25 వేలు ఆర్థిక సహాయాన్ని ఫౌండేషన్ నాయకులు అందజేశారు. పేదల ఆర్ధిక అభివద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు రమేష్, రాజు, శంకర్, దశరథ్, జైపాల్, గోపాల్ ,లచ్చిరాం ,హాతి రామ్, బద్యా ,మెడి గడ్డ ఉప సరంచ్ మల్లేష్ ,వినోద్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.