Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేతల ఉపన్యాసాలతో శబ్ద కాలుష్యమే తప్ప ఏమీ లేదు
- హామీల ప్రస్తావనే లేదు
- తెలంగాణ పోరాట పటిమను ప్రస్తావించకపోగా అవమానించారు
- మోడీ, అమిత్షా ప్రజలకు క్షమాపణ చెప్పాలి
- పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశంలోనూ, రాష్ట్రంలోనూ కారు- కమలానికి వీడ్కొలు పలకడమే దేశానికి రక్ష అని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ నేతల ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలకు శబ్ద కాలుష్యమే తప్ప ఒరిగిందేమీ లేదని విమర్శించారు. విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని మోడీ ప్రస్తావించలేదనీ, తెలంగాణ పోరాట పటిమను ప్రస్తావించకపోగా అవమానించారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని మోడీ, అమిత్షా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటును అవమానించేలా తెలంగాణ గడ్డ మీద నుంచే అమిత్షా మాట్లడటం దుస్సహసమన్నారు. బీజేపీ సమావేశాలు తర్వాత టీఆర్ఎస్ వీధి నాటకాలను గమనించిన పిమ్మట ఈ దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పాలన మాత్రమే దేశానికి రక్ష అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనతో మాత్రమే అన్ని వర్గాల ప్రజలు, రైతులు, ప్రజలు,సుఖశాంతులతో జీవించే పరిస్థితి ఉంటుందనే విషయం ప్రజలకు అర్ధమైందనీ, ఇరు పార్టీలకు వీడ్కోలు పలకడమే మిగిలి ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గత వారం రోజులుగా తెలంగాణ వీధుల్లో బీజేపీ, టీఆర్ఎస్ వీధి నాటకాలు గంగిరెద్దుల వాళ్లలాగా ప్లెక్సీల పంచాయితీలు చిల్లరమల్లర పంచాయితీలు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీసహా యావత్ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వస్తుంటే, ఇప్పటికైనా విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలుకు సంబందించి నిరిష్ట ప్రణాళిక ప్రకటిస్తారని ఆశించామని పేర్కొన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు విభజన చట్టంలో స్పష్టమైన హామీలిచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించామంటూ జబ్బులు చరుకుచునే బీజేపీ...హామీలను అమలు చేయాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్టు, తెలంగాణ యువతకు దక్కాల్సిన లక్షలాది ఉద్యోగాలు ఉద్యోగాలు రాకపోవటానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వలేదని విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి వందలాది మంది రైతుల ప్రాణాలు బలిగొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉపాధి కరువై యువత ప్రాణాలు తీసుకునే స్థితికి వచ్చారని పేర్కొన్నారు. ఇంత దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వానికి ఎనిమిదేండ్లుగా ప్రతీ నిర్ణయంలో ప్రతీ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతిస్తూ వచ్చిందని గుర్తు చేశారు. అభివద్ధి విషయంలో మొండి చేయి చూపిన బీజేపీ కనీసం కేసీఆర్ కుంటుంబం అవినీతిపై నోరుమెదపలేదని తెలిపారు. గడిచిన మూడేండ్లుగా కేసీఆర్ అవినీతిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడితోపాటు రాష్ట్ర పార్టీ నాయకులు హెచ్చరికలు చేయడం తప్ప ఒక్క అడుగు ముందుకేయలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుటుంబానికి ఏటీఎంలా మారిందని పేర్కొన్నారు. దీనిపై ఎందుకు తీసుకోవడం లేదంటే మాత్రం సమాధానం లేదని విమర్శించారు.