Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భయంతో ప్రయాణికుల పరుగులు
- రైళ్లు నిలిపివేసిన రైల్వే అధికారులు
నవతెలంగాణ-భువనగిరిరూరల్
సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న దక్షిణ్ ఎక్స్ప్రెస్ రైలులో శనివారం రాత్రి యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి సమీపంలోని పగిడిపల్లి వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చివరి భోగిలో లిథియం అయాన్ బ్యాటరీలకు సంబంధించిన ముడి సరుకు మాత్రమే ఉండటంతో అది రైలులోని ఆఖరి బోగి కావడం వల్ల పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 12 గంటల తర్వాత బయల్దేరింది. బయల్దేరిన కొద్దిసేపటికే రైళ్లోని చివరి బోగీలో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన రైల్వే సిబ్బంది రైలు పగిడిపల్లి సమీపంలో ఆపి దాదాపు 8 ఫైరింజన్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ముడిసరుకులు, బ్యాటరీలు ఉన్న బోగికావడంతో మంటలు అంతకంతకు ఎక్కువగా ఎగిసిపడ్డాయి. దాంతో చివరిబోగీలో సామగ్రి అంతా అగ్నికి ఆహూతయ్యాయి. అనంతరం దక్షిణ్ ఎక్స్ప్రెస్ రైలు చివరి బోగిని రైల్వేస్టేషన్లోనే వదిలివెళ్లారు. ప్రస్తుతం ఇతర రైళ్ల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి.