Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేపీహెచ్బీలో వారం కిందట మిస్సింగ్..
- జిన్నారంలో దొరికిన డెడ్‌బాడీ
నవతెలంగాణ-జిన్నారం/కేపీహెచ్‌బీ
హైదారబాద్‌లోని కేపీహెచ్బీలో అదృశ్యమైన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ సంగారెడ్డి జిల్లా జిన్నారంలో దారుణంగా హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. హత్య అనంతరం జిన్నారం అటవీ ప్రాంతంలో యువకుని మృతదేహాన్ని తగులబెట్టినట్టు పోలీసులు గుర్తించారు. కేపీహెచ్‌బీ సీఐ కిషన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా రాజువారి పాలెం పోదల కొండపల్లికి చెందిన శనివరపు నారాయణరెడ్డి(25) హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ రోడ్ నెంబర్ 1లో తన స్నేహితులతో కలిసి నివసిస్తున్నారు. కాగా ఆ యువకుడు ఏడాది కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఆ పెళ్లి ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా ఆ యువతి, నారాయణరెడ్డి ఫోన్లో మాట్లాడుకుంటున్నట్టు గుర్తించిన తల్లిదండ్రులు, బంధువులు.. అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గత నెల 27వ తేదీ నుంచి నారాయణరెడ్డి కనిపించకుండా పోవడంతో అతని కుటుంబ సభ్యులు 30వ తేదీన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంలో మిస్సింగ్ కేసు నమోదైంది. దర్యాఫు జరుగుతుండగానే జిన్నారం మండల పరిసర ప్రాంతాల్లో ఓ యువకుడు హత్యకు గురయ్యాడని సమాచారం రావడంతో.. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు.. 0% కాలిన గాయాలతో హత్యకు గురైన వ్యక్తిని నారాయణరెడ్డిగా నిర్ధారించారు. కొందరు వ్యక్తులు నారాయణరెడ్డితో కలిసి మద్యం సేవించి.. అనంతరం గొంతు నులిమి హత్య చేశారని.. మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు దర్యాఫ్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
మద్యం తాగేందుకు తీసుకెళ్లి..
ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు.. మృతుని కాల్‌డేటా ఆధారంగా శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. శ్రీనివాస్‌రెడ్డితో నారాయణరెడ్డికి ముందే పరిచయం ఉండటంతో జూన్ 29న వాళ్లిద్దరితో పాటు మరికొంతమంది ఖాజాగూడ వద్ద ఓ వైన్‌షాపులో మద్యం కొనుగోలు చేసి ఓ చోట తాగారు. అనంతరం నారాయణరెడ్డిని గొంతు నులిమి హతమార్చి జిన్నారం అటవీ ప్రాంతంలో పెట్రోల్ పోసి తగులబెట్టినట్టు శ్రీనివాస్‌రెడ్డి పోలీసుల ఎదుట బయట పెట్టాడు. నిందితుడు చెప్పిన వివరాల మేరకు ఘటనాస్థలానికి పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.