Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పలేదు:
'మోడీ మస్ట్ ఆన్సర్' పేరుతో ట్విట్టర్ వేదికగా మంత్రి హరీశ్‌రావు ఫైర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రానికి, దేశానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ ప్రధాని నరేంద్రమోడీ సమాధానం చెప్పలేక ముఖం చాటేశారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయసంకల్ప సభలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగం పూర్తికాగానే ఆయన 'మోడీ మస్ట్ ఆన్సర్' పేరుతో ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధిస్తూ వరుస ట్వీట్లు చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి దేశానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి అభివద్ధి విధాన మేదైనా ప్రకటిస్తారని ఆశించాం. కల్లబొల్లి కబుర్లు, జుమ్లాలు తప్ప విధానమే లేదని తేల్చేశారు. సీఎం కేసీఆర్ అడిగిన ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పలేదు... సరికదా అసలు తమకు జవాబుదారీతనమే లేదని నిరూపించారు అని ట్వీట్ చేశారు.
- రాష్ట్రం నుంచి లక్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నామని చెప్తున్నారు మోడీగారు.. మరి గడిచిన నెల రోజులుగా 90 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని కేంద్రం తీసుకోవడంలేదు. దీని విలువ రూ.22వేల కోట్లు ఉంటుంది. ఇదేనా మీ రైతు అనుకూలత మోడీ గారు..? మా రైతుల ధాన్యం తీసుకుంటామని సభా వేదిక నుంచి ప్రకటిస్తారని ఆశించాం.. కనీసం దాని ఊసే ఎత్తలేదు.
- మీ ప్రసంగంలో మహిళలను మీరేదో ఉద్ధరిస్తున్నట్టు చెప్పారు. మరి పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఎనిమిదేండ్లయినా ఎందుకు ఆమోదించలేదు..? సమాధానం ఎందుకు చెప్పలేదు..? తెలంగాణాలో స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ నిబద్దత చాటుకున్నారు.
- గిరిజన మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చామని మీ కేంద్ర మంత్రులు విజయ సంకల్ప సభ వేదికగా చెప్పారు.. బాగానే ఉంది. మా రాష్ట్రంలో గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి పంపించింది. దాన్ని ఇప్పటి వరకు మీ నేతత్వంలోని ప్రభుత్వం ఆమోదించలేదు. దీనిపై కూడా మీరు వేదికపై సమాధానం చెప్తారని మా గిరిజన సోదరులు భావించారు. అంతే కాదు.. మా గిరిజన యూనివర్సిటీకి ఇప్పటికీ నిధులు, అనుమతులు ఇవ్వలేదు.
- మా సమ్మక్కసారక్క ఉత్సవానికి జాతీయహౌదా ఎందుకు ఇవ్వలేదు..? తెలంగాణ గిరిజనులు మీకు కనిపించడంలేదా..? అంటూ వరుస ట్వీట్లు చేశారు.