Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే అభివృద్ధి
- విజయసంకల్ప సభలో ప్రధాని మోడీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలోకి వస్తేనే... అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన బీజేపీ విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడారు. తొలుత ఆయన తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించి, ఆ తర్వాత హిందీలో కొనసాగించారు. కేంద్రంలో 8 ఏండ్ల పాలనలో చాలా చేశామని చెప్పుకొచ్చారు. రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామనీ, దశాబ్దాలుగా అణచివేతకు గురైనవారిని భాగస్వాముల్ని చేస్తున్నామని అన్నారు. జన్ ధన్ ద్వారా దేశవ్యాప్తంగా 45 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిస్తే.. అందులో కోటికిపైగా జన్ ధన్ అకౌంట్లు తెలంగాణవేనని చెప్పారు. ముద్ర, స్టాండ్ అప్ ఇండియా ద్వారా ఇచ్చిన రుణాల్లోనూ మహిళలకు పెద్దపీట వేశామని చెప్పారు. చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులకు కూడా ప్రత్యేక పథకాల ద్వారా చేయూత ఇచ్చామన్నారు. హైదరాబాద్ నగరంలో ఆధునిక సైన్స్ సిటీ ఏర్పాటుకు చాలా కాలంగా కషి చేస్తున్నామనీ, ఇది పూర్తయితే తెలుగు మీడియంలో టెక్నాలజీ, మెడికల్ చదువులు మొదలవుతాయనీ, పేద, గ్రామీణ ప్రాంత విద్యార్థుల కల నెరవేరుతు ందని అన్నారు. రామగుండం ఎరువుల కారా?నా కూడా ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పున్ణప్రారంభించామన్నారు. ఈ సందర్బంగా ఆయన రాష్ట్రంలోని భద్రాద్రి, యాదగిరిగుట్ట, వరంగల్ భద్రకాళి దేవాలయం, రామప్ప, కాకతీయతోరణం వంటి పలు స్థానిక అంశాలను ప్రస్తావించారు. కరోనా సమయంలో తెలంగాణలో ప్రతి కుటుంబానికి సాయం చేశామనీ, వేగంగా కరోనా వ్యాక్సిన్లు ఉచితంగా అందించామని చెప్పుకొచ్చారు. పేదలకు ఉచితంగా రేషన్, వైద్యం అందించామనీ, అందుకే భారతీయులకు బీజేపీపై విశ్వాసం పెరిగిందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందించిన పలు అభివృద్ధి పనులను ఈ సందర్భం గా ఆయన సభలో ప్రస్తావించారు. రాష్ట్రంలో రూ.35వేల కోట్ల కంటే ఎక్కువ విలువ చేసే ఐదు జల ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. గడచిన ఆరేండ్ల్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల నుంచి రూ.లక్ష కోట్లు విలువ చేసే ధాన్యాన్ని సేకరించిందనీ, ఆ డబ్బులు కూడా చెల్లించామన్నారు. వరి ధాన్యానికి రూ.80 మద్దతు ధరను పెంచి, దాన్ని క్వింటాకు రూ.2వేలకు చేర్చామన్నారు. హైదరాబాద్‌లో ప్రజలకు మరిన్ని రవాణా వసతులను కల్పించడానికి రూ.1,500 కోట్లు కేటాయించామనీ, వీటితో నాలుగు, ఆరు లైన్ల రోడ్లతో పాటు, మరిన్ని ఫ్లై ఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 350 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే రీజనల్ రింగ్ రోడ్డు కూడా హైదరాబాద్ లో నిర్మించబోతున్నామని చెప్పారు. పల్లెలను నేషనల్ హైవేలతో కలుపుతూ 2,700 కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో రోడ్లు వేశామన్నారు. తెలంగాణలో ఇప్పుడు ఐదు వేల కిలోమీటర్ల పొడవైన హైవే నెట్ వర్క్ కేంద్ర ప్రభుత్వం వల్లే వచ్చిందని అన్నారు. అలాగే రాష్ట్రంలో మెగా టెక్స్ టైల్ పార్క్ రాబోతోందని ప్రకటించారు. దీని ఏర్పాటుతో రైతులకు మేలు జరుగుతుందనీ, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. కేంద్రమంత్రి అమిత్‌షా మాట్లాడుతూ కొడుకును ముఖ్యమంత్రిని ఎలా చేయాలా అనేదే సీఎం కేసీఆర్ ఆలోచన అని విమర్శించారు. 8 ఏండ్లలో ఆయన ఒక్కసారి కూడా సచివాలయానికి వెళ్లలేదనీ, వచ్చే ఎన్నికల తర్వాత ఆ అవకాశం తమకే దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో దేశం పురోగమిస్తుంటే తెలంగాణ తిరోగమిస్తున్నదని అన్నారు. హైదరాబాద్ విమోచన దినాన్ని సీఎం కేసీఆర్ వ్యతిరేకించారనీ, టీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేతుల్లో ఉందని విమర్శించారు. సర్డార్ వల్లభారు పటేల్ లేకుంటే హైదరాబాద్ రాష్ట్రం భారత్‌లో విలీనం అయ్యేదే కాదన్నారు. తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలుకుతామని చెప్పారు. మరో కేంద్రమంత్రి పీయూష్‌గోయల్ మాట్లాడుతూ అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపులను తెలంగాణ ప్రజలు ఇక ఏమాత్రం భరించలేరన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతున్నదనీ, ఆ సొమ్మంతా ఎవరి జేబుల్లోకి వెళ్తున్నదని ప్రశ్నించారు. సభలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజరు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాధ్, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. నడ్డా, అమిత్‌షా సమక్షంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరారు.