Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దేశభక్తి పేరుతో ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేసే ఓట్ల రాజకీయం తెలంగాణలో చెల్లదని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. హైదరాబాద్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని, కేంద్రమంత్రుల ప్రకటనలు చూశాక వారికి అధికారదాహం తప్ప, అభివృద్ధి ప్రస్తావనే లేదన్న విషయం తేలిపోయిందన్నారు. దానికోసమే సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంబద్ధ విమర్శలు చేశారని చెప్పారు. తెలంగాణ ప్రజానీకానికి అనేక పోరాటాలు చేసిన ఘన చరిత్ర ఉందన్నారు. ఉత్తరాది తరహాలో దక్షిణాదిన బీజేపీ ఆటలు సాగబోవని హెచ్చరించారు.