Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారతదేశం నుండి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్ఐసీసీఐ) ప్రతినిధి బృందం కువైట్‌లో పర్యటిస్తున్నట్టు భారత పత్రికా సమాచార కార్యాలయం తెలిపింది. దానిలో భాగంగా అక్కడి
భారత రాయబార కార్యాలయంలో ఫుడ్ అండ్ బేవరేజెస్ సెక్టార్ ప్రతినిధులతో ఫిక్కీ సభ్యులు భేటీ అయ్యారు. ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ (ఐబీపీసీ), ఇండియన్ బిజినెస్ నెట్వర్క్ భాగస్వామ్యంతో వ్యాపార సమావేశం జరిగింది. దీనిలో కువైట్‌లోని భారత రాయబారి హెచ్.ఇ. సిబి జార్జ్ పాల్గొన్నారు. కువైట్‌తో భారతదేశానికి ఉన్న వ్యాపార, సంస్కృతిక, రాజకీయ సంబంధాలను ఆయన వివరించారు. 2022-23 కువైట్‌కు ఎగుమతులు పెంచడంలో లక్ష్యాలను నిర్దేశించుకున్నట్టు చెప్పారు. బియ్యం, సముద్ర ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, మాంసం, పాల ఉత్పత్తులు మరియు పౌల్ట్రీ ఉత్పత్తులు, టీ, కాఫీ, తణధాన్యాలు, జీడిపప్పు వంటి ఆహార, పానీయాల రంగంలో అనేక అంశాలను గుర్తించినట్టు వివరించారు.