Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మూడు రోజుల మహాసభలు ముగిసాయి. ఏటా జరిగే ఈ మహాసభలు కోవిడ్ కారణంగా ఈసారి రెండేండ్ల విరామం తర్వాత జరిగాయి. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు 17వ ఆటా మహాసభలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుండి అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐ కుటుంబాలకు చెందిన 15వేల మంది ఒకే చోట కలిసి మూడు రోజులపాటు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, చామకూరి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గాదరి కిషోర్, చంటి క్రాంతి కిరణ్, రవీంద్రకుమార్, టీఎస్ఐఐసీ చైర్మెన్ గాదరి బాలమల్లు తదితరులు ఈ సభలకు హాజరయ్యారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, చర్చాగోష్టులు, భాషా పరిరక్షణ, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ సహా అనేక అంశాలపై ఈ సభల్లో మాట్లాడారు. మ్యూజిక్ లెజండ్ ఇళయరాజా, సంగీత దర్శకుడు తమన్, పర్యావరణ వేత్త జగ్గీ వాసుదేవ్ కూడా హాజరయ్యారు. సమావేశాలను విజయవంతం చేసినందుకు ఆటా అధ్యక్షులు భువనేశ్ భుజాల, కన్వీనర్ సుధీర్ బండారు, అనిల్ బోయినపల్లి తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.