Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సబ్‌జోనల్ సమావేశానికి ఆమె హాజరయ్యారు. రాష్ట్రంలో మహిళ, శిశు అభివృద్ధి,సంక్షేమం కోసం ఆరోగ్య లక్ష్మి, కళ్యాణ లక్ష్మి, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, బాలరక్షక్ వెహికిల్, బాలామృతం ప్లస్,వంటి ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వానికి మరింత అండగా నిలవాలని కోరారు. రాష్ట్రంలో మరిన్ని అంగన్వాడి కేంద్రాలు ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగుల జీతాల వాటా..25 శాతం మాత్రమే ఇస్తున్నదనీ, 60 శాతానికి పెంచాలని కోరారు. సఖి కేంద్రాలకు నిధులు సకాలంలో రాకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రులు భగవత్ కిషన్ రావు, డాక్టర్ మునిపార మహేంద్ర బాయిలి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్సులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లక్షద్వీప్, కర్నాటక రాష్ట్రాల ప్రతినిధులు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు , ఆయా రాష్ట్రాల బాలల హక్కుల కమిషన్ సభ్యులు తదితర అధికారులు పాల్గొన్నారు.