Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రవేశాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ గ్రామానికి ప్రభుత్వ జూనియర్ కాలేజీ మంజూరైంది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే ఈ కాలేజీలో ప్రవేశాలు చేపట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవోనెంబర్ 100ను శుక్రవారం విడుదల చేశారు. మహేశ్వరం నియోజ కవర్గానికి విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తు న్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. మీర్పేట్ కాలేజీతో కలిపి ఈ సంఖ్య 406 కానుంది.