Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్లో దరఖాస్తు గడువు 18
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు ఇంజినీరింగ్‌తోపాటు వృత్తి విద్యా కాలేజీ యాజమాన్యాల నుంచి జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) హైదరాబాద్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. మంగళవారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాలని కోరింది. ఈ మేరకు జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఎం మంజూర్ హుస్సేన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2022-23 విద్యాసంవత్సరంలో అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అందుకు అవసరమైన ఇతర డాక్యుమెంట్లను సమర్పించాలని సూచించారు. షషష.jఅ్బష్ట్రaaష.ఱఅ వెబ్‌సైట్‌ను చూడాలని కోరారు. ఇతర వివరాలకు 8008421860 నెంబర్‌ను లేదా రబజూజూశీత్ీaaషఏjఅ్బష్ట్ర.aష.ఱఅ మెయిల్‌ను సంప్రదించాలని సూచించారు.
ఏఐసీటీఈ నుంచి అనుమతి రాకుండా ఎలా? : టీఎస్టీసీఈఏ
అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నుంచి ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యా కాలేజీలకు ఎక్స్టెన్షన్ ఆఫ్ అప్రూవల్ (ఈవోఏ) రాకుండా అనుబంధ గుర్తింపు కోసం జేఎన్టీయూహెచ్కు ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలని టీఎస్టీసీఈఏ అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్ ప్రశ్నించారు. గతేడాది ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాతే ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయకుండానే ఆన్లైన్లో దరఖాస్తులను ఎలా చేయాలని అడిగారు. విధివిధానాల్లేకుండా సర్క్యులర్ ఇస్తే ఎలా?అని ప్రశ్నించారు. కాలేజీ యాజమాన్యాలు సిబ్బందిగా ఎవరిని చూపించాలని నిలదీశారు. జేఎన్టీయూహెచ్ అధికారులు స్పందించి వెంటనే ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే కాలేజీల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించాలని కోరారు.