Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నాయకుల నివాళి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య నేటి తరానికి స్ఫూర్తి అని పలువురు కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. సోమవారం గాంధీభవన్లో రోశయ్య జయంతి, అల్లూరి సీతారామరాజు జయంతి, పింగళి వెంకయ్య వర్థంతిని పురస్కరించుకుని వారికి నివాళులర్పించారు. అనంతరం టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, అధికార ప్రతినిధి కల్వ సుజాత, టీపీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. వివాదరహితుడైన రోశయ్య ఆశయాలను నెరవేరుస్తామన్నారు. టీఆర్ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందంతో ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. కేసీఆర్ వేసిన ప్రశ్నల్లో నరేంద్రమోడీని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు లేవని అన్నారు. బీజేపీ ప్రజలను విభజించి రాజకీయాలు చేస్తుంటే కాంగ్రెస్ అందరిని కలుపుకుంటూ ముందుకెళ్తుందన్నారు.