Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 64వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి మంత్రి వెళ్లిన సంగతి తెలిసిందే. అదే వేదిక మీద వేలాది మంది ఎన్ఆర్ఐలు, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, గాదరి కిషోర్, ఆటా ప్రతినిధులు, తదితరుల సమక్షంలో కేక్ కట్ చేశారు. మంత్రికి హాజరైన వారంతా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్, కేటీఆర్, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ తదితరులు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.