Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుమారు మూడు కోట్ల విలువగల బంగారం అపహరణ
- చోరీకి వెల్డింగ్ కట్టర్ ఉపయోగించడంతో కాలిబూడిదైన నగదు
- క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు
నవతెలంగాణ-మెండోరా
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. సుమారు 3.5 కోట్ల విలువ గల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. దుండగులు చోరీకి వెల్డింగ్ కట్టర్‌ను ఉపయోగించడంతో పలు డాక్యుమెంట్లతో సహా రూ.7.30 లక్షల నగదు కాలి బూడిదైంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను నిజామాబాద్ సీపీ నాగరాజు విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు.
తెలంగాణ గ్రామీణ బ్యాంకు పరిసర ప్రాంతాల్లో ఉన్న ట్రాక్టర్ కేజ్‌వీల్, బీఎస్ఎన్ఎల్ టవర్ గదిలోని కుర్చీలను వాడుకుని బ్యాంకు వెనుక భాగంలో నుంచి దొంగలు బ్యాంకులోకి చొరబడ్డారు. మొదటగా చోరీకి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు దొరకకుండా దుండగులు ముఖాలకు మాస్కులు, చేతులకు గ్లౌసులు వేసుకుని బ్యాంకు వద్ద ఉన్న సీసీ కెమెరాలు, డివైస్‌ను పగులగొట్టారు. గ్యాస్ వెల్డింగ్ కట్టర్‌తో షెట్టర్‌ను పగులగొట్టి బ్యాంకులోకి చొరబడ్డారు. బ్యాంక్ లోపలున్న గేట్ తాళం ఫెయిల్ అవ్వడంతో దుండగులు లోపలికి సునాయాసంగా చొరబడి.. గోల్డ్‌లోన్‌కు సంబంధించిన లాకర్‌ను గ్యాస్ వెల్డింగ్ కట్టర్‌తో కట్ చేయగా లాకర్లో ఉన్న లోన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లతో సహా రూ.7.30లక్షల నగదు కాలిబూడిదైంది. సుమారు 3.50 కోట్ల విలువగల ఎనిమిది కిలోల 30 తులాల బంగారాన్ని అపహరించుకుపోయారు. అయితే బ్యాంకుకు ఆదివారం సెలవు కావడంతో ఈ చోరీ శనివారం అర్ధరాత్రి జరిగిందా లేదా ఆదివారం అర్ధరాత్రి చేశారా అనేదానిపై స్పష్టత లేదు. అయితే విధుల్లో భాగంగా సోమవారం ఉదయం బ్యాంకుకు వచ్చిన బ్యాంకు మేనేజర్ రాజేశ్వర్‌గౌడ్ బ్యాంకులో చిందరవందరగా పడి ఉన్న వస్తువులను చూసి ఎస్ఐ శ్రీనివాస్‌యాదవ్‌కు సమాచారం అందించారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు నిర్వహించారు. చోరీకి గురైన బ్యాంక్‌ను సీపీ నాగరాజు పరిశీలించారు. దుండగులు వదిలి వెళ్లిన మాస్క్, గ్యాస్ కట్టర్, గ్యాస్ సిలిండర్, గ్యాస్ బుడ్డీలను స్వాధీనం చేసుకున్నారు.
అనుభవమున్న దొంగల గ్యాంగ్..
ఈ దొంగతనం గమనిస్తే బాగా అనుభవమున్న దొంగల గ్యాంగ్ చోరీకి పాల్పడినట్టు కనిపిస్తుందని సీపీ తెలి పారు. ఈ దుండగులు రహదారి పక్కనున్న బ్యాంకులను గూగుల్ మ్యాప్ ద్వారా సెర్చ్ చేసి చోరీలకు పాల్పడుతు న్నట్టు అనుభవపూర్వకంగా తెలిపారు. ఈ కేసుకు సంబం ధించిన దుండగులను అనుభవజ్ఞులైన టెక్నికల్ క్లూస్ టీంల ద్వారా పట్టుకుంటామని, రాచకొండ నుంచి స్పెషల్ టీమ్‌ల ను రప్పించి చుట్టుపక్కల ఉన్న ప్రతి స్థలంలో, దాబాలలో సోదాలు జరుపుతామని వెల్లడించారు. సమావేశంలో ఎస్ఐ శ్రీనివాస్ యాదవ్, సీఐ గోవర్ధన్‌రెడ్డి, ఏసీపీ ప్రభాకర్ రావు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.