Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌తోపాటు పలుచోట్ల విస్తారంగా వానలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే రెండు, మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. కొన్నిజిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించారు. ఉత్తర ఒరిస్సా, దక్షిణ జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని గ్యాంగ్‌టక్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో అల్పపీడనం నెలకొంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనము సగటు సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతిదిశకు ఒంపు తిరిగి ఉన్నది. సోమవారం రాత్రి పది గంటల వరకూ రాష్ట్రంలో 400కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైనట్టు టీఎస్‌డీపీఎస్ వెల్లడించింది. సంగారెడ్డి పట్టణ కేంద్రంలో అత్యధికంగా 5.18 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. సోమవారం సాయంత్రం నుంచి రాత్రివరకూ హైదరాబాద్ నగరంలోనూ ముసురు పడింది. కొన్నిచోట్ల మోస్తరు వర్షం కురిసింది.