Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే పుస్తకాలు, యూనిఫాం అందించాలి :
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నాలు
నవతెలంగాణ- విలేకరులు
ప్రభుత్వ పాఠశాలల్లో వెంటనే పాఠ్యపుస్తకాలు, యూనిఫాంను అందించాలని, సమస్యలను పరిష్కరించి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడ అనిల్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజావాణిలో వినతిపత్రాన్ని అందజేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ రవి మాట్లాడుతూ.. తక్షణమే పాఠ్యపుస్తకాలు అందించాలని, ప్రతి విద్యార్థికీ రెండు జతల నాణ్యమైన యునిఫామ్ అందించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని, ఖాళీగా ఉన్న టీచర్స్ పోస్టులు వెంటనే భర్తీచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ముందుగా స్థానిక పోస్టాఫీస్, అంబేద్కర్ సెంటర్ నుంచి విద్యార్థులు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ఎదుట బైటాయించారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. కలెక్టర్ని కలవటానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది.