Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక చట్టాలు
- విభజన హామీలపై మోడీ మోసం
- సెప్టెంబర్ 5న ఢిల్లీలో కార్మిక కర్షక జాతీయ సమీక్ష : సీఐటీయూ జాతీయ కార్యదర్శి సాయిబాబు
నవతెలంగాణ-మిర్యాలగూడ
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని.. వాటిని నిరసిస్తూ ఆగస్టు ఒకటి నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు సీఐటీయూ జాతీయ కార్యదర్శి సాయిబాబు తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రంగాల కార్మికుల సమన్వయంతో ఈ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఆగస్టు 14న రాత్రి సామూహిక జాగరణ దీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు. కార్మిక చట్టాలను కార్పొరేట్ పెట్టుబడిదారులకు అను కూలంగా రూపొందించారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 లేబర్‌కోడ్‌లుగా కార్పొరేట్లకు అనుకూలంగా మార్చిం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడరైజేషన్ సాకుతో రైల్వే, బీఎస్ఎన్ఎల్, ఎఫ్‌సీఐ, విద్యుత్ వ్యవస్థలను ప్రయివేట్‌పరం చేసి దేశ సంపదను గుప్పెడు మందికి కట్టబెట్టాలని చూస్తుందని విమర్శించారు. కేంద్రం సీఎంఆర్ ధాన్యం కొనకపోవడం వల్ల 1500మిల్లులు మూతపడి లక్షలాది మంది కార్మికుల ఉపాధి పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయడంలో విఫలమైన ప్రధాని మోడీ.. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలనడం తెలంగాణ ప్రజలను మోసగించ డమేనని చెప్పారు. కనీస వేతన చట్టం అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం దాగుడు మూతలు ఆడు తుందని, ప్రయివేటీకరణ ద్వారా కార్మికులతోపాటు ప్రజలకు తీరని నష్టం కలుగుతుందని చెప్పారు. లేబర్కోడ్ల రద్దు, ప్రభుత్వరంగ సంస్థల్లో విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కోరుతూ సెప్టెంబర్ 5న ఢిల్లీలో కార్మిక కర్షక జాతీయ సమీక్ష నిర్వ హించ నున్నట్టు ప్రకటించారు.పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మోడీ.. ముందుగా రైల్వేలో ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైల్వే కాంటాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జాతీయ కన్వీనర్ రమేష్‌బాబు, సీఐటీయూ నాయకులు డబ్బికార్ మల్లేష్, డా.మల్లు గౌతమ్‌రెడ్డి, తిరుపతి, రామ్మూర్తి, ఎండి.అంజద్, పాపిరెడ్డి, గుణగంటి రామచంద్రు, రామారావు, మల్లయ్య, చారి పాల్గొన్నారు.