Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నేషనల్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ది న్యూస్ పేపర్ అసోసియేషన్ ఆఫ్ కర్ణాటక ప్రదానం చేసిన నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ అవార్డ్స్-2022ను తెలంగాణకు చెందిన ఐదుగురు నర్సులు అందుకున్నారు. బెంగుళూరు మెడికల్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో వారు ఈ అవార్డులను అందుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో చేసిన సేవలను గుర్తిస్తూ ఈ అవార్డులను ప్రధానం చేసినట్టు వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ట్రైయిన్డ్ నర్సెస్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ముప్పిడి రాజేశ్వరి, ఉస్మానియా గ్రేడ్ నర్సింగ్ సూపరింటెండెంట్ సుజాత రాథోడ్, గాంధీ వైద్యశాల హెడ్ నర్స్ ఫ్లోరెన్స్, నిలోఫర్ ఆస్పత్రి నుంచి లక్ష్మణ్, సనత్నగర్ ఈఎస్ఐ వైద్యశాల నర్సింగ్ సూపరింటండెంట్ మంజుల అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు. లోకాయుక్త మాజీ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ హెగ్డే, నటి హర్షి పుణచ్చా అవార్డులను బహుకరించారు.