Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కమిషన్ బేసిస్పై తపాలా జీవిత బీమా పాలసీలు సేకరించేందుకు కావాల్సిన ఏజెంట్ల నియమకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు హైదరాబాద్ నగర తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ రిప్పన్ డల్లెట్ తెలిపారు. పదో తరగతి పాసయ్యి 18 నుంచి 50 ఏండ్ల మధ్య వయస్సున్న హైదరాబాద్ నగరానికి చెందిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆసక్తిగలవారు దరఖాస్తులను తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్, దీవాన్ దేవడి, హైదరాబాద్-02 ఆఫీసులో జులై 15వ తేదీ లోపు అందజేయాలని తెలిపారు. ఎంపిక చేసిన అభ్యర్థులు జులై 19, 20, 2022 తేదీలలో ఉదయం 10 గంటలకు సంబంధిత సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఏజెంటుగా నియమితులైనవారు సెక్యూరిటీ డిపాజిట్ గా ఐదు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్, హైదరాబాద్, సౌత్ ఈస్ట్ డివిజన్ ఆఫీసునుగానీ, 040- 23463802/805/807 నెంబర్లకు ఫోన్చేసిగానీ సమాచారం పొందవచ్చునని సూచించారు.