Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లైంగికదాడుల మూలాలను అరికట్టడంలో విఫలం : భూమిక ఉమెన్ కలెక్టివ్ సమావేశంలో వి.సంధ్య
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో విషసంస్కృతి విస్తరిస్తున్నా దాన్ని అరికట్టకుండా కేంద్రంలోని బీజేపీ సర్కార్ చోద్యం చూస్తున్నదని పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య విమర్శించారు. భూమిక ఉమెన్ కలెక్టివ్ వ్యవస్థాపకురాలు కొండవీటి సత్యవతి అధ్యక్షతన మంగళవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మహిళలకు సంబంధించిన వార్తలు-మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్య మాట్లాడుతూ నోరు విప్పితే ఈ దేశ సంస్కృతిని కాపాడే వారిగా ఫోజులిచ్చే నాయకులు మహిళలపై లైంగికదాడుల పెరుగుదలకు కారణమైన పోర్న్సైట్లను మాత్రం అడ్డుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశాలను ఈ విషసంస్కృతి నుంచి కాపాడుకునేందుకు మలేషియా, చైనా తదితర దేశాలు తీసుకున్న చర్యలను ఆమె వివరించారు. భారతదేశం అలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడమే బీజేపీ నైజాన్ని బయటపెడుతున్నదన్నారు. తాము పదే పదే కులదురహంకార హత్యలని చెబుతున్నా ....వాటిని పరువు హత్యలంటూ హంతకులపై సానుభూతి పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓయు జర్నలిజం ప్రొఫెసర్ పద్మజా షా మాట్లాడుతూ మహిళలపై హింస జరిగినప్పుడు వాటిని సంచలనాత్మక వార్తలుగా కాకుండా సామాజిక అవగాహన పెరిగేలా రాయాలని సూచించారు.