Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరీశ్ రావుకు వసంత ధన్యవాదాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వాస్పత్రిలో అన్ని సౌకర్యాలున్నాయనీ, ప్రసవాల కోసం సర్కారు దవాఖానాకే పోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన పోచయ్య కూతురు వసంత సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రిలో డెలివరీ అయ్యారు. సాధారణ కాన్పు అయి తల్లిబిడ్డ క్షేమంగా ఉండటంతో మంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ తండ్రి, కూతురు లేఖ రాశారు. దీనిపై మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ, ఈ ఉత్తరం మహిళల్లో, ప్రజల్లో గొప్ప చైతన్యం, స్ఫూర్తిని ఇస్తుందన్నారు.