Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో 342ను వర్తింపజేయాలి
- రిజ్వీకి టీయుఎంహెచ్ఇయూ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగాల్లో జీవో నెంబర్లు 217, 459 ప్రకారం నియమితులైన వారికి జీవో 342ను వర్తింపజేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టియుఎంహెచ్ఇయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి భూపాల్, కె.యాదానాయక్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి వినతిపత్రం సమర్పించారు. 2001లో మంజూరైన పోస్టుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పారామెడికల్ ఉద్యోగులను భర్తీ చేశారని తెలిపారు. వీటిని జీవో నెం.217 (26.02.2001), జీవో నెం 459 (22.05.2002)ల ప్రకారం నియామకాలు చేపట్టారని గుర్తుచేశారు. వీరికి రెమ్యురేషన్ వంద శాతం గ్రాస్ శాలరీతో సమానంగా బేసిక్, డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ తదితరాలు కలిపి ఇస్తున్నారని పేర్కొన్నారు. ఆర్పీఎస్ 2020కి సంబంధించి కూడా జీవో నెం 342 (13.06.2022) ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిపారు.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ జారీ చేసిన జీవో నెంబర్ 342లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని మార్క్ చేయకపోవడంతో ఆ పరిధిలో ఉన్న వారికి జీతాలిచ్చేందుకు అధికారులు అభ్యంతరం చెబుతున్నారని తెలిపారు. డీఎంఈ పరిధిలో కూడా జీవో అమలయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కుటుంబ సంక్షేమం కమీషనర్ (సీఎఫ్ డబ్ల్యూ) పరిధిలో జీవో నెం 217, 459 ప్రకారం ఏఎన్ఎంలు కొంత మంది పని చేస్తున్నారనీ, వారికి జీవో నెంబర్ 342 కాపీని పంపించాలని విజ్ఞప్తి చేశారు.