Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే గిరిజనులకు అన్యాయం జరిగిందని రాష్ట్ర మహిళా శిశు-సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లో మీడియాతో మంత్రి మాట్లాడుతూ గిరిజనుల రిజర్వేషన్ల పెంపు కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పటికీ ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. గత ఐదేండ్ల నుంచి అనేకసార్లు కేంద్రానికి లేఖలు రాసినప్పటికీ స్పందించడం లేదని తెలిపారు. రిజర్వేషన్లు పెంచకపోవటంతో ఉద్యోగాల్లో, విద్యాసంస్థల ప్రవేశాల్లో గిరిజనులు నష్టపోతున్నారని చెప్పారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు పట్ల కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించిందని గుర్తు చేశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. గిరిజనుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారని మంత్రి తెలిపారు.