Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పౌరసరఫరాలశాఖ మెమో జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో తిరస్కరించిన 19 లక్షల రేషన్ కార్డులను తిరిగి తనిఖీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ అంతర్గత మెమో జారీ చేశారు. ఈ నెల ఐదు నుంచి 20వ తేదీ వరకు 15 రోజుల పాటు ఈ తనిఖీ చేయనున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ ఈ మోమోను జారీ చేసింది.