Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల స్టోర్స్‌లో లోడింగ్, అన్లోడింగ్ పనిచేస్తున్న కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ స్టోర్స్ వర్కర్స్ యూనియన్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కత్తుల యాదయ్య, పాలడుగు భాస్కర్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కోరారు. వీరిని ఆర్టిజన్లుగా గుర్తించేందుకు న్యాయస్థానం కూడా ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. స్టోర్స్‌లో 20 ఏండ్లకు పైగా తాము పనిచేస్తున్నా, సేవల్ని ఇప్పటి వరకు గుర్తించలేదన్నారు. దీర్ఘకాలికంగా తాము విద్యుత్‌శాఖలో పనిచేస్తున్నామనీ, కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆర్టిజన్లుగా గుర్తించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.