Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఇస్కీ) ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు నిర్వహించే అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవానికి రావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను ఆహ్వానించారు. అందుకు సీఎస్ సుముఖుత తెలిపారని ఇస్కీ డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వర్రావు గురువారం వెల్లడించారు. ఇస్కీ కార్యక్రమాలతో పాటు (ఎస్పీజీఎస్) స్కూల్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ స్టడీస్‌కు సంబంధించిన కార్యక్రమాలను సీఎస్‌కు వివరించామని పేర్కొన్నారు.