Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో ఈసీజీ స్కాం నిధులు రూ.50 కోట్లు డ్రా చేసినట్టు వచ్చిన సమాచారంపై సర్కారు ఆరా తీస్తున్నది. ఈసీజీ స్కాం నిధుల్లో రూ.50 కోట్లు డ్రా....? శీర్షికతో ఈ నెల 2న (శనివారం) నవతెలంగాణ వార్తా కథనాన్ని ప్రచురించింది. నిధుల విడుదల, స్కాం విచారణ - రిపోర్ట్, ఇందుకోసమే అవసరం లేకపోయినా డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారుల తీరు తదితర అంశాలను ఆ కథనంలో పేర్కొంది. నిజంగా అవినీతి జరిగిందా? స్కాం నిధులు విడుదలయ్యాయా?, అంతర్గత విచారణ ఎలా జరిగింది? తదితర అంశాలపై రిపోర్ట్ ఇవ్వాలని నిఘావర్గాలను ఆదేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నిధుల విడుదలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలుస్తున్నది.