Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ హబ్ ద్వారా 15 రోజుల్లో అనుమతి : సాఫ్రాన్ క్రస్ట్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్
- వెయ్యి మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు
నవతెలంగాణ- శంషాబాద్
ప్రపంచ స్థాయి పారిశ్రామిక పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రదేశంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. పెట్టుబడులు పెట్టే వారికి టీ హబ్ ద్వారా 15 రోజుల్లో అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టులో సాఫ్రాన్ ఎయిర్ క్రస్ట్ ఇంజన్లు ఎలక్ట్రికల్, పవర్ కోసం రెండు కొత్త పొరుగు ప్లాంట్లను మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడిదారులే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లని సీఎం కేసీఆర్ అంటుంటారని గుర్తు చేశారు. తెలంగాణలో ఏరో స్పేస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసే ఎమ్మార్వో ప్రపంచంలోనే పెద్దదని తెలిపారు. ప్రపంచ స్థాయి సంస్థ భారత దేశంలో ఏర్పాటు చేసే మొదటి ఇంజిన్ ఎమ్మార్వో అని చెప్పారు. దాదాపు 1200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన సంస్థలో సుమారు 800 నుంచి 1000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సాఫ్రాన్ నిర్ణయం హైదరాబాద్లో పెట్టుబడులకు పెట్టే ఇతర సంస్థలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. విమాన రంగంలో కేంద్రం నుంచి తెలంగాణకు అనేక అవార్డులు వచ్చాయని తెలిపారు. సాఫ్రాన్ సీఈవో, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒలివియర్ అండ్రీస్ మాట్లాడుతూ.. భారత దేశంలో జులై 7, 8 తేదీల్లో మూడు కొత్త ఉత్పత్తి సైట్లను ప్రారంభించడంతోపాటు దేశంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరిచే దిశలో 2025లో ప్రధానమైన నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సాఫ్రాన్ దేశంలో 10 కేంద్రాల్లో 750 మంది ఉద్యోగాలను కలిగి ఉందన్నారు. 2018-2025లో 200 మిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టడానికి నిర్ణయించామన్నారు. సాఫ్రాన్ కొత్త సైట్లతో భారతీయ ఏరో స్పేస్, డిఫెన్స్ పరిశ్రమలతో ఉన్న సుదీర్ఘ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. వాణిజ్య ఇంజిన్ల కోసం అతి పెద్ద నిర్వహణ మరమ్మతు కేంద్రాన్ని నెలకొల్పడం ద్వారా భారత దేశంలో ఎంఆర్ఓ కార్యకలాపాలను మిలిటరీ ఇంజిన్లకు విస్తరించేెందుకు మార్గాన్ని సుగమం చేసుకుంటున్నామని తెలిపారు.275 ఉపాధి కల్పించగా ప్లాంట్ పారిశ్రామిక ప్రక్రియలు,యంత్రాల పరికరాలు స్థిరత్వం పరంగా సాఫ్రాన్ అత్యున్నత ప్రమాణాలను అందిస్తుందన్నారు. సాఫ్రాన్ క్రస్ట్ ఇంజిన్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జీన్ పాల్ అల్లరి మాట్లాడుతూ.. ఈ ప్లాంట్ సమీపంలో నిర్మించుకున్న సీఎఫ్ఎం లీఫ్ ఇంజన్ల కోసం నూతన నిర్వహణ మరమ్మతులు ఓవర్ ఫాల్ ఓవర్ ఆల్ ఎమ్మార్ఓ కేంద్రాన్ని నెలకొల్పుతున్నట్టు ప్రకటించారు.