Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లలో పోటీ చేస్తామనీ, అందులో ఎలాంటి అనుమానం లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిళ చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో వైఎస్ఆర్టీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడుతూ నగరంలో వైఎస్‌కు కేటాయించిన స్థలాన్ని సీఎం కేసీఆర్ వెనక్కు లాక్కున్నారని చెప్పారు. రాజశేఖర్‌రెడ్డి చనిపోతే తెలంగాణలో 400 మంది చనిపోయారని గుర్తు చేశారు. ప్రస్తుత టీఆర్ఎస్ భవన్‌ను స్థలమిచ్చింది రాజశేఖర్‌రెడ్డి కాదా?..అని ప్రశ్నించారు. వైఎస్సార్ గౌరవార్థం హైదరాబాద్‌లో స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్‌ను రాజకీయ నాయకులుగా చేసింది వైఎస్సారేనని చెప్పారు. రాజశేఖర్‌రెడ్డిని కాంగ్రెస్ అవమానించిన విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు కావాలనే వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఎలాంటి గౌరవం ఇవ్వలేదని వాపోయారు. హైదరాబాద్‌లో ఆయనకు ఎలాంటి గౌరవప్రదమైన స్థలం లేదు'' అని చెప్పారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. స్వయంకృతాపరాధాలతోనే కాంగ్రెస్ దెబ్బతిన్నదని తెలిపారు. కేసీఆర్ కూడా వైఎస్సార్‌కు తీరని అన్యాయం చేశారని తెలిపారు. 2004లో టీఆర్ఎస్ బలం ఎంతో తెల్వనిదా? అని ప్రశ్నించారు.