Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెవెన్యూ సదస్సుల నిర్వహణపై కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌లో సీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రెవెన్యూశాఖపై ఈ నెల 11న సీఎం కేసీఆర్ నిర్వహించే సమీక్షా సమావేశానికి సమగ్ర సమాచారంలో రావాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణపై గురువారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఆర్డీఓలు, సీసీఎల్ఏ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 15 నుంచి నిర్వహించే మండల స్థాయి రెవెన్యూ సదస్సులను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లాకలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలనీ, రెవెన్యూ సదస్సు షెడ్యూల్‌పై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈ రెవెన్యూ సదస్సుల నిర్వహణ వేదికల వద్ద మొబైల్ ఈ-సేవా కేంద్రం, ఇంటర్నెట్, ఇతర మౌలిక సదుపాయాలు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సదస్సుల్లో అందే అన్ని దరఖాస్తులకు రసీదులు ఇవ్వాలని స్పష్టం చేశారు.ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జీఏడీ కార్యదర్శి వి.శేషాద్రి, ఆయా శాఖల ఉన్నతాధికారులు రొనాల్డ్‌రోస్, సర్ఫరాజ్ అహ్మద్, రజత్‌కుమార్‌షైనీ, సత్యశారద, వెంకటేశ్వర్రావు, తదితరులు పాల్గొన్నారు.