Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు కులసంఘాలకు భవన నిర్మాణ పత్రాలు మంత్రులు అందజేత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వెనుకబడిన వర్గాల (బీసీ)కు అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ అని మంత్రులు గంగుల కమలాకర్, వి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆత్మగౌరవ సూచికగా బీసీ ఆత్మగౌరవ భవనాలు 41 కులాలకు హైదరాబాద్ నడిబొడ్డున వేల కోట్లు విలువ చేసే 82.30 ఎకరాల్లో నిర్మాణమవుతున్నాయని చెప్పారు. ఆరు కులసంఘాలకు ఆత్మగౌరవ భవన నిర్మాణ పత్రాలను శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్ ఆర్డీలో మంత్రులు అందజేశారు. ఏకసంఘంగా ఏర్పడి 24 కుల సంఘాలు అనుమతులు పొందాయని వివరించారు. ఏకసంఘంగా ఏర్పడని వాటికి మరో వారం గడువు, లేదంటే ప్రభుత్వమే నిర్మాణం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కోరుకంటి చందర్, సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరి గౌరీశంకర్, జలవనరుల సంస్థ చైర్మెన్ వి ప్రకాశ్, బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.