Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో -హైదరాబాద్
అమెరికాలో అధిక సాంద్రత పత్తి సాగు బాగుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. వర్షాధారముంటే హెక్టారుకు 60 నుంచి 75 వేల మొక్కలుంటాయని పేర్కొన్నారు. సాగునీటి సదుపాయముంటే హెక్టారుకు లక్ష 10 వేల మొక్కలు వేసుకునే అవకాశముందని తెలిపారు. పత్తిసాగులో ఆధునిక పద్దతులు, అధిక సాంద్రత పత్తి సాగుపై అధ్యయనంలో భాగంగా గురువారం అమెరికాలో మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్ర నాయక్, డాక్టర్ మెతుకు ఆనంద్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, సీడ్ ఎండీ కేశవులు పర్యటించారు. భవిష్యత్తులో హెక్టారుకు లక్ష 40 వేల మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా ఇక్కడి రైతులు పత్తి పంట తర్వాత జొన్న సాగు చేస్తూ పత్తిలో అధిక దిగుబడులు సాధిస్తున్నారని వివరించారు.