Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు మంత్రి గంగుల ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని విద్యాలయాల్లో నిల్వ బియ్యం నాణ్యతను పరిశీలించాలని అధికారులను మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. మిల్లింగ్ అంశాలపై శుక్రవారం హైదరాబాద్లో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎఫ్సీఐ నిర్ణయం, టెస్ట్ మిల్లింగ్ రిపోర్టు వంటి అంశాలపై చర్చించారు. అన్ని అంశాలతో సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్కు అందిస్తామని తెలిపారు. విద్యాసంస్థల్లో బియ్యం సరిగా ఉంచకపోతే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండి నాణ్యతలేని చోట వాటిని మార్చి పాత బియ్యం సరఫరా చేయాలని ఆదేశించారు.