Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దళితుల్లో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధుకు రూపకల్పన చేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు . రాష్ట్రంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా కూడా ఇటువంటి పథకం లేదని చెప్పారు. ఎస్సీ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,లబ్దిదారులకు అనుభవం, వృత్తి నైపుణ్యం ఉన్న, ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడే యూనిట్ల ఎంపికకు ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు. పాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు డెయిరీలు, మినీ డైయిరీల ఏర్పాటును ప్రోత్స హించాలని సూచించారు. కోళ్లు, గొర్రెలు, చేపల పెంపకాన్ని ఇంకా ప్రోత్స హిద్దామన్నారు. ఇప్పటివరకు మంజూరైన మొత్తం 36 వేల 265యూనిట్లు కాగా, వీటిలో 28,970 యూనిట్లు మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయనీ, మిగతా వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం రూ.3,100 కోట్లు విడుదల చేసిందనీ, బడ్జెట్లో ప్రవేశపెట్టిన రూ.17,700 కోట్లకు సంబంధించిన లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను త్వరలో మొదలు పెట్టాల్సి ఉంటుందని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కార్పోరేషన్ చైర్మెన్ బండా శ్రీనివాస్, దళితబంధు పథకం సలహాదారు లక్ష్మారెడి ్డ,మేనేజిం గ్ డైరెక్టర్ కరుణాకర్, జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.
బీజేపీ, ప్రతిపక్షాలవి తప్పుడు ప్రచారాలు
బీజేపీి, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ శ్రేణులకు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. శుక్రవారం హైదరా బాద్‌లోని టూరిజం ప్లాజాలో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన సోషల్ మీడియా వారియర్స్‌కు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగు తున్నదని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న గర్వంతో ఆ పార్టీ నాయకులు దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తున్నారని చెప్పారు. బీజేపీ రైతు, కార్మిక, మహిళ, యువజన, విద్యార్థి, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యతిరేక విధా నాలను ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. అన్ని వర్గాల సంక్షేమం, సముద్ధరణకు,అన్ని రంగాల సర్వతోముఖాభివృద్ధికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి గురించి మరింత ప్రచారం చేయాలని సూచించారు.