Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫార్మసీ కాలేజీలకు పీసీఐ హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తప్పుడు ధ్రువపత్రాలు సమర్పిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ కాలేజీ యాజమాన్యాలను ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) హెచ్చరించింది. ఈ మేరకు పీసీఐ రిజిస్ట్రార్ కమ్ సెక్రెటరీ అర్చనా ముద్గల్ శుక్రవారం సర్క్యులర్ విడుదల చేశారు. కాలేజీల్లో కోర్సు, శిక్షణ, పరీక్షలకు సంబంధించి పీసీఐకి సమర్పించే సమాచారం లేదా ధ్రువపత్రాలపై పూర్తి అధికారాలు ఫార్మసీ చట్టం-1948లోని సెక్షన్ 12 (3) ప్రకారం పీసీఐకి ఉన్నాయని తెలిపారు. స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ ఫార్మాట్ (ఎస్ఐఎఫ్)నకు సంబంధించి సకాలంలో అవసర మైన వివరాలను పీసీఐకి సమర్పించాలని కాలేజీ యాజమాన్యాలను కోరారు. సరైన సమాచారం అందించాలని సూచించారు. తప్పుడు సమాచారం, మోసపూరిత ధ్రువపత్రాలు సమర్పిస్తే ఆయా కాలేజీలు, ట్రస్టు, సొసైటీ, కంపెనీల ప్రిన్సిపాళ్లు, చైర్మెన్, కార్యదర్శిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తప్పుడు ధ్రువపత్రాలు స మర్పించి ఉద్దేశపూర్వకంగా పీసీఐని తప్పుదారి పట్టించొద్దని సూచిం చారు. తప్పుడు సమాచారమిచ్చిన కాలేజీ యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్న పీసీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తు న్నామని టీఎస్టీసీఈఏ అధ్యక్షులు సంతోష్‌కుమార్ ప్రకటనలో తెలిపారు.