Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుడా చైర్మెన్ సుందర్రాజ్ యాదవ్
నవతెలంగాణ-హన్మకొండ
సంస్కృతి, సంప్రదాయాల చరిత్ర గురించి ప్రజలను కవులు, కళాకారులే చైతన్యవంతం చేస్తున్నారని కుడా చైర్మెన్ సుందరరాజ్ యాదవ్ తెలిపారు. కాకతీయ వైభవ సస్తాహంలో భాగంగా హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో శుక్రవారం కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూడా చైర్మెన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్, హనుమకొండ జెడ్పీ చైర్మెన్ సుధీర్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రముఖకవి పొట్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కవులు, కళాకారుల మీదే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కవి సమ్మేళనాలు జరిగేలా చొరవ తీసుకుంటామని చెప్పారు. కాగా, కవి సమ్మేళనానికి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్ సహా ప్రముఖ నేతలు హాజరు కాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమంలో కవులు అంపశయ్య నవీన్, వల్స పైడి, తిరునగరి నరేందర్, డీపీఆర్వో లక్ష్మణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.