Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హామీల అమలులో సీఎం కేసీఆర్ విఫలం
- కేవీపీఎస్ వరంగల్ జిల్లా మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ - ఖిలా వరంగల్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం రద్దుకు కుట్రలు చేస్తున్నదని, వాటిని ప్రతిఘటిస్తూ రాజ్యాంగ రక్షణకు యువతరం సిద్ధం కావాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం వరంగల్ జిల్లా శివనగర్‌లోని రఘునాధ్ భవన్లో కేవీపీఎస్ వరంగల్ జిల్లా ప్రథమ మహాసభను జిల్లా నాయకులు పొడేటి దయాకర్, ఉసిల్ల కుమార్, చిట్యాల మౌనిక అధ్యక్షతన నిర్వహించారు. కేవీపీఎస్ పతాకాన్ని సంఘం జిల్లా సీనియర్ నాయకులు హన్మకొండ సంజీవ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో స్కైలాబ్‌బాబు పాల్గొని మాట్లాడారు. బీజేపీ అధికారంలోకొచ్చాక ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం రద్దు చేసి దళితులకు అడుగడుగునా అన్యాయం చేసిందన్నారు. దళితులు, మహిళలపై దాడులు పెరిగాయన్నారు. దేశభక్తి ముసుగులో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ దేశద్రోహానికి పాల్పడుతోందని విమర్శించారు. సీఎం కేసీఆర్ పాలనలో దళితుల వాగ్దానాలు అమలుకాలేదన్నారు. దళిత సీఎం, దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో అన్యాయం జరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేకవిధానాలపై కేవీపీఎస్ కార్యకర్తలు సమరశీల ఉద్యమాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం సంఘం జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ నివేదిక ప్రవేశపెట్టారు. మహాసభలో వ్యకాస రాష్ట్ర నాయకులు సీహెచ్ రంగయ్య, ఐద్వా జిల్లా కార్యదర్శి నలిగంటి రత్నమాల, కేవీపీఎస్ హన్మకొండ జిల్లా కార్యదర్శి మంద సంపత్, బొట్ల చక్రపాణి, ముల్కలగూడెం సర్పంచ్ బండి పర్వతాలు, జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి కాడబోయిన లింగయ్య, కేవీపీఎస్ జిల్లా నాయకులు హన్మకొండ ఆనంద్, పొడేటి దయాకర్, ఆవుల ఉదరు కొంగర వరుణ్, సింగారపు సుమన్ ,రాములు రాంప్రసాద్, సింగారపు బాబు, భాస్కర్, భరత్ తదితరులు పాల్గొన్నారు.