Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెల్దండ
మండల పరిధిలోని చౌదర్పల్లి గ్రామానికి చెందిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అమెరికా దేశంలో తెలుగు ప్రజలు నిర్వహిస్తున్న 17వ ఆట వేడుకలకు మెగా డోనర్ గా అవతరించి రూ. 2 కోట్లు అందించడంతో భారతదేశంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా చెప్పవచ్చని చౌదర్పల్లి గ్రామస్తులు సురేష్ రెడ్డి, శ్రీశైలం, జగన్, చంద్రశేఖర్, వెంకటయ్య, మల్లయ్య , బాలరాజు, రమేష్ గౌడ్ పేర్కొన్నారు. అమెరికా దేశంలో మెగా డొనర్ గా అవతరించిన సింగిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గ్రామంలో ఇప్పటికే రూ 50 లక్షలతో సిసి రోడ్లు నిర్మించడం , అలాగే ఆ పదాన్ని వచ్చిన ప్రతి ఒక్కరికి తన వంతు సహాయంగా చేస్తున్న రాఘవేందర్ రెడ్డిని గ్రామస్తులు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద చేరి ఫోన్ ద్వారా అభినందించారు. ముందు ముందు మరిన్ని సేవలు చేసి కల్వకుర్తి నియోజకవర్గ అభివద్ధికి కషి చేయాలని గ్రామస్తులు కోరారు.