Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టర్ ఆవిష్కరించిన ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు సర్వతోముఖాభివృద్ధికి నిలయాలని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి అన్నారు. సకల సౌకర్యాలున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఇంటర్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు చేరండి అంటూ తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్ల సంఘం (టీజీసీటీఏ) రూపొందించిన దోస్త్ 2022-23 వాల్పోస్టర్ను శుక్రవారం హైదరాబాద్లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు సకల సదుపాయాలతో విరసిల్లుతున్నాయని చెప్పారు. నిపుణులైన, అనుభవజ్ఞులైన అధ్యాపకులు పాఠ్యాంశాలను బోధిస్తారని అన్నారు. విశాలమైన క్రీడా మైదానాలు మెరుగైన ప్రయోగశాలలున్నాయని వివరించారు. గ్రంథాలయాలు, టీఎస్కేసీ ప్లేస్మెంట్ వంటి సదుపాయాలున్నాయని చెప్పారు. ఈ సౌకర్యాలు ఇంటర్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, రూసా ప్రాజెక్టు అధికారి సౌందర్య, టీజీసీటీఏ అధ్యక్షులు సంగి రమేష్, కార్యదర్శి ఈ బ్రిజేష్, చైర్మెన్ కె విజరుకుమార్ పాల్గొన్నారు.