Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కండ్లులా భావించేవారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. దేశంలోనే నంబర్ వన్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలబెట్టారని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడిగా ఆయన ఎప్పుడూ ప్రజల గుండెల్లోనే ఉంటారని కొనియాడారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పంజాగుట్ట సర్కిల్లో ఆయన విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీభవన్, సీఎల్పీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న కుట్రలు తిప్పికొట్టేందుకు వైఎస్ఆర్ మన మధ్య లేకపోవడం దురదష్టకరమని చెప్పారు. ఆయన హయాంలో రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. జలయజ్ఞం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగు నీరందించారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను దేశమే ఆదర్శంగా తీసుకునేలా సంక్షేమం, అభివద్ధి చేసి చూపించారనీ, వారు అమరులైనా... ఆయన పేరు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయిందని చెప్పారు. ఆయన ఆలోచనలు కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ వైఎస్ఆర్ నిరంతరం ప్రజల కోసమే పని చేశారని చెప్పారు. సంక్షేమంతోపాటు దేశానికి అభివృద్ధిని చూపించిన మహనీయుడు వైఎస్ఆర్ అన్నారు. ఆయన లేని లోటు మనందరికీ బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్పని మహానేత వైఎస్ఆర్ అని కొనియాడారు. ఉచిత విద్యుత్‌పై మొదటి సంతకం చేసిన నేతగా గుర్తింపు పొందారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మహేష్‌కుమార్‌గౌడ్, షబ్బీర్ అలీ, కుసుమకుమార్, కేవీపీ రామచంద్రరావు, అంజన్కుమార్యా దవ్ విజయారెడ్డి, రోహిన్‌రెడ్డి, మెట్టుసాయికుమార్ ఉన్నారు.