Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో ఆదివాసీలపై, ప్రత్యేకించి తమ భూమి హక్కులను కాపాడుకునేందుకు పోరాడుతున్న మహిళలపై రాష్ట్ర ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించడం శోషనీయమని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ శనివారం ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని కోట్లాది ప్రజల ఉమ్మ్మడి ఆకాంక్షలను నెరవేర్చడానికి తెలంగాణ ఏర్పడిందనీ, అందులో ఆదివాసీ హక్కుల పరిరక్షణ ఒక ముఖ్యమైన భాగమని పేర్కొన్నారు. ఆదివాసీ మహిళల గొంతును అణిచివేసేందుకు పోలీసు బలగాలను అణచివేయడం దుర్మార్గమని తెలిపారు.
దాడులు దుర్మార్గం : అన్వేష్‌రెడ్డి
పోడు భూములకు పట్టాలివ్వకుండా గిరిజన, గిరిజనేతర రైతులపై పోలీసులు దాడులు చేయడం దుర్మార్గమని కిసాన్‌సెల్ రాష్ట్ర చైర్మెన్ అన్వేష్‌రెడ్డి విమర్శించారు.