Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఈఎస్సీఐ అనేది భారతదేశంలోని అతిపెద్ద ప్రొఫెషనల్ ఇంజినీర్ల సంస్థ 'ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండి యా) ' స్వయం ప్రతిపత్తి కలిగిన అటానమస్. ఇంజినీరింగ్ టెక్నో-మేనేజ్మెంట్ డొమైన్లలో నాణ్యమైన శిక్షణ, విద్యను అందించే ఉద్దేశంతో 1981లో స్థాపించబడింది. ఏఐసీటీఈ 2022-24 సంవత్సరానికి కింది స్ట్రీమ్‌లలో రెండు సంవత్సరాల పూర్తి సమయం పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌లకు అనుమతి/గుర్తింపును ఇచ్చింది.
1.పీజీడీఎం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ (పీజీడీఎం-ఐఎం)- 60 సీట్లు (ప్రస్తుతం 30 నుండి 60కి పెరిగింది) 2. పీజీడీఎం జనరల్ మేనేజ్మెంట్ (పీజీడీఎం-జీఈఎన్) - 120 సీట్లు 3. పీజీడీఎం ఇండిస్టియల్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ (పీజీడీఎం-ఐఎస్ఈఎం) - 60 సీట్లతో కొత్త ప్రత్యేకమైన కోర్సు. మారుతున్న గ్లోబల్ ట్రెండ్లు, పరిశ్రమ అవసరాలు, సాం కేతిక ఆవిష్కరణలు మొదలైన వాటికి అనుగుణంగా ప్రోగ్రామ్‌లు రూపొందిం చబడ్డాయి. ఈ ప్రోగ్రామ్‌లు వ్యాపారంపై సమగ్ర దృక్పథాన్ని అందిస్తాయి. అత్యంత నిష్ణాతులైన పరిశ్రమ, విద్యా నిపుణులతో సంభాషించే అవకాశాన్ని అందిస్తాయి. నైతికత విలువలపై రాజీ పడకుండా విద్యార్థులు తమ ఆసక్తి ఉన్న ప్రాంతంలో రాణించాలని ఈఎస్సీఐ ఆశయాలను పెంపొందిస్తుంది. 2022-24 సెషన్ కోసం ఇంజినీరింగ్ ఇతర గ్రాడ్యుయేట్ల నుండి పై ప్రోగ్రా మ్‌లలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. విద్యార్థులకు బ్యాంకు రుణ సహాయం, ప్లేస్మెంట్ శిక్షణ, ప్లేస్మెంట్ సహాయం అందించ బడతాయి. గతంలో 95 నుండి 100 శాతం విద్యార్థులు ఆకర్షణీయమైన పే ప్యాకేజీలతో ప్రసిద్ధ సంస్థల్లో ప్లేస్మెంట్ పొందారు. మరింత సమాచారం కోసం విద్యార్థులు/తల్లిదండ్రులు www.escihyd.org వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. నేరుగా వచ్చి తెలుసుకోవడానికి హైదరాబాద్ గచ్చిబౌలిలోని క్యాంపస్‌ను సందర్శించాలని సూచించారు.