Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడలో కోత్తగా చేస్తున్న అటవీ ఆక్రమణలను మాత్రమే అడ్డుకున్నామనీ, ఎక్కడా తాము పాత పోడు భూముల జోలికి వెళ్లడం లేదని రాష్ట్ర అటవీ శాఖ ప్రకటించింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. చట్టపరిధిలో అటవీ భూములను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. కోయపోచగూడ ఘటనకు తమను బాధ్యులుగా చిత్రీకరించడం తగదని స్పష్టం చేసింది. పులుల అభయారణ్యం, రక్షిత అటవీ ప్రాంతానికి చెందిన భూమిని స్థానికులు ఆక్రమించే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నామని తెలిపింది.