Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే మూడ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరా బాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె. నాగరత్న తెలిపారు. తెలంగాణలో ఒడిశా సరిహద్దు లో అల్పపీడనం నెలకొందనీ, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడం వల్ల రాష్ట్రంలో విస్తారం గా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇది నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని తెలిపారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను ప్రకటించింది. రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలోని 8 జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. నిజామా బాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిచే అవకాశం ఉంది. అలాగే భూపాల పల్లి, ములుగు, మంచిర్యాల, కొత్తగూడెంలో భారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాం తాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో శనివారం ఈ ఏడాది రికార్డు స్థాయిలో 935 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా ముదోల్లో కుండపోత వర్షం కురిసింది. అక్కడ అత్యధికంగా 20.88 సెంటీమీటర్ల వర్ష పాతం (శనివారం రాత్రి పదున్నర వరకు) రికార్డయి ంది. 26 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షం పడింది. 80 ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
రెడ్ అలర్ట్ జిల్లాలు : ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, ములుగు
ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు : జగిత్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యా పేట, మహబూబాబాద్, వరంగల్(అర్బన్), వరంగల్ రూరల్, మెదక్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల.