Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి
నవతెలంగాణ- హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు కరెంటు తీగలు, ట్రాన్స్ఫారాలు, సబ్ స్టేషన్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి సూచించారు. ఇండ్లలో కూడా ఎర్త్ వైర్లను తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని, లూజ్ కనెక్షన్లు, స్విచ్‌ల జోలికి వెళ్ళొద్దని హెచ్చరించారు. శనివారంనాడాయన సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ జే శ్రీనివాస్‌రెడ్డితో కలిసి చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వానాకాలం సీజన్ ముగిసే వరకు ప్రతి జిల్లా, సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాతావరణ మార్పులను నిరంతరం గమనిస్తూ ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ నిరంతర పర్యవేక్షణలో ఉండాలని ఆదేశించారు. స్కాడా, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూములు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వీటిలో నిరంతరం 15 మంది స్కిల్డ్ సిబ్బంది, డివిజన్ స్థాయి డిజాస్టర్ టీంలు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యుత్‌కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వున్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు, ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106, 7382071574 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి.
ొ వర్షాలు పడేటప్పుడు స్టే వైర్, విద్యుత్ లైన్ల క్రింద, ట్రాన్సఫార్మర్ల వద్ద నిలబడరాదు. వీలైనంతవరకు వాటికి దూరంగా ఉండాలి. పశువులను, పెంపుడు జంతువులను కూడా విద్యుత్ పరికరాల నుండి దూరంగా ఉంచాలి.
ొ ఎక్కడైనా రోడ్డు మీద, నీటిలో కానీ విద్యుత్ తీగ పడి ఉంటే దాన్ని తొక్కడం, వాటి మీది నుంచి వాహనాలు నడపడం చేయరాదు. తెగిన తీగలు కనిపిస్తే తక్షణం సమీప విద్యుత్ సిబ్బందికి గానీ, లేదా కంట్రోల్‌రూంకు కానీ ఫోన్ ద్వారా సమచారం ఇవ్వాలి.
ొ ఎవరైనా విద్యుత్ షాక్ బారిన పడ్డప్పుడు వారిని రక్షించడానికి లోహపు రాడ్లను ఉపయోగించకుండా చెక్క, ప్లాస్టిక్‌తో చేసిన పైప్‌లను మాత్రమే వాడాలి.